top of page

Alliance for Responsible Aquaculture
మేము జల వ్యవసాయంలో చాలా ముఖ్యమైన సమస్యలను పరిష్కరిస్తున్నాము.
మేము జల వ్యవసాయంలో ఒక ముఖ్యమైన మలుపులో ఉన్నాము: చేపల పెంపకంలో, చేపలు మరియు వాటిని పెంచే రైతులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. బాధ్యతాయుతమైన చేపల పెంపక కూటమి (ARA) అనేది భారతదేశంలో ఉత్తమ పద్ధతులను అమలు చేసే ప్రారంభదశ ఉత్పత్తిదారుల మరియు ప్రభుత్వేతర సంస్థల(NGO) సమిష్టి.
కలిసి, చేపల సంక్షేమం మరియు రైతుల శ్రేయస్సును మెరుగుపరుద్దాము.
.png)
మరింత నిజాయితీగ
ఎవరూ వెనుకబడి ఉండకూడదు. మేము కొత్త మార్కెట్లను అందచేయడానికి రైతులకు సహాయం చేస్తాము మరియు వారి ప్రయత్నాలకు పరిహారం లభించేలా ప్రయత్నిస్తాము.
మరింత సహజంగా
అధిక సంక్షేమంలో ఉత్పత్తి చేయబడిన చేపలు, మరింత విస్తృతమైన వ్యవస్థలకు తక్కువ రసాయనాలు అవసరం (ఉదా. క్రిమినాశకాలు).
మరింత దయతో
చేపలు మెరుగైన జీవన పరిస్థితులను కలిగి ఉంటాయి మరియు వ్యాధి మరియు సామూహిక మరణాలకు తక్కువ గురవుతాయి.
బాధ్యతాయుతమైన చేపల పెంపక కూటమిలోని రైతులు చేపలను ఈ విధంగా పెంచుతారు:
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో బాధ్యతాయుతమైన చేపల పెంపక కూటమి యొక్క పని ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
తర్వాత ఏమిటి?
బాధ్యతాయుతమైన చేపల పెంపక కూటమిలో చేరడానికి ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులోను మరియు పశ్చిమ గోదావరి లోని చేపల రైతుల కోసం వెతుకుతున్నాం. కూటమి సభ్యుడిగా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు అంచనాలు క్రింద లికించబడినవి.
మీ నుండి ఏమి కావాలి
-
సిఫార్సు చేసిన స్థాయిలో నిల్వ చేయడం.
-
మీ స్థానిక FWI ప్రతినిధి సిఫార్సు చేసిన విధంగా నీటి నాణ్యతను మెరుగుపరచడానికి దిద్దుబాటు చర్య తీసుకోవడం.
-
మీ వ్యవసాయ క్షేత్రానికి మీ స్థానిక FWI ప్రతినిధిని సందర్శించటానికి అనుమతించడం.
మీరు ఏమి యాక్సెస్ చేస్తారు
-
ఏ ఖర్చు లేకుండా నీటి నాణ్యత పర్యవేక్షణ మరియు సలహాలను పొందుతారు .
-
మా నిపుణుల బృందంతో ఉచితంగా శిక్షణ మరియు సంప్రదింపులు పొందుతారు.
-
భవిష్యత్ మార్కెట్ అనుసంధానాలు.
-
మా నిపుణుల బృందంతో శిక్షణ మరియు సంప్రదింపులు ఉచితం.
-
సాధ్యమైన బీమా అర్హతలు.
మరికొంత సమాచారం
మరింత తెలుసుకోవాలనుకుంటున్నాను? మమ్మల్ని సంప్రదించండి
bottom of page